భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ మండల కేంద్రంలోని చొక్కయ్య గుట్ట అయ్యప్ప క్షేత్రం లో శ్రీ హనుమాన్ ఆలయ నిర్మాణం పనులకు బాల్కొండ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ భూమి పూజ చేశారు. ఇందులో భాగంగా వేద పండితులు నంబి వాసుదేవచార్యులు ప్రత్యేక పూజలను నిర్వహింపజేసి భూమి పూజను గావించారు. అనంతరం అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలను చేసిన అర్చకులు ముఖ్య అతిథిని సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్, మున్సిపల్ కౌన్సిలర్లు,అయ్యప్ప సేవ సమితి స్వాములు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
