28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

 జిల్లా బేస్ బాల్ సీనియర్ మహిళల జట్టుకు తృతీయ స్థానం 

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : ఈనెల జగిత్యాల్ జిల్లాలో 6 నుండి 8 వరకు నిర్వహించిన ఇంటర్ డిస్టిక్ బేస్ బాల్ టోర్నమెంట్లో నిజాంబాద్  మహిళల జట్టు తృతీయ స్థానం రావడం జరిగింది అని జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ మధుసూదన్ రెడ్డి,  ప్రధాన కార్యదర్శి సోప్పరి వినోద్  తెలిపారు.మహిళల జట్టుకు ట్రోఫీని అందించిన తెలంగాణ బేస్ బాల్ అసోసియేషన్ ప్రధాన సెక్రెటరీ శ్వేత, కోశాధికారి డాక్టర్ కృష్ణ జట్టుకు బహుమతులు అందించడం జరిగింది. జిల్లా జట్టును జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్, సాఫ్ట్ బాల్ అకాడమీ కోచ్ నరేష్, మౌనిక, సీనియర్ క్రీడాకారిణి అర్చన, వ్యాయామ ఉపాధ్యాయురాలు జోష్ణ, శ్రీలత విద్యార్థులను అభినందించారు.

Third place for district baseball senior women's team

More articles

Latest article