27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎత్తిపోతల సిబ్బందిపై దొంగల దాడి

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : సాలూర మండల శివారులోని ఎత్తిపోతల పంప్ హౌస్ సిబ్బందిపై దుండగులు దాడి చేశారు. ట్రాన్స్ ఫార్మర్ చోరీ చేసేందుకు దుండగులు ప్రయత్నిస్తున్న సమయంలో అలికిడికి ఎత్తిపోతల ఆపరేటర్, వాచ్ మెన్ అప్రమత్తమయ్యారు. దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దుండగులు గతంలో రెండుసార్లు ట్రాన్స్ ఫార్మర్ కాయిల్స్ ను దొంగిలించారు. పోలీసులు దుండగులను వెంటనే పట్టుకోవాలని రైతులు కోరుతున్నారు. దొంగలు మరాఠీ లో మాట్లాడడంతో మహారాష్ట్ర వాసులు అయి ఉండొచ్చని  రైతులు భావిస్తున్నారు.

Thieves attack lift staff

More articles

Latest article