25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆడబిడ్డా అని వదిలించుకున్నారు

Must read

📰 Generate e-Paper Clip

. . . అప్పుడే పుట్టిన పసిపాపను పేపర్లో చుట్టి రోడ్డుపై వదిలేశారు

. . . మాక్లూర్ మండల కేంద్రంలో ఘటన

. . . అంగన్ వాడి టీచర్ కు అప్పగించిన స్థానికులు

మాక్లూర్,  బతుకమ్మ

అప్పుడే పుట్టిన ఆడబిడ్డను తల్లి వదిలేసిన ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రంలో జరిగింది. ఆదివారం తెల్లవారుజామున స్థానికంగా రోడ్డుపై ఓ పేపర్ లో చుట్టి పసికందును వదిలేశారు. ఉదయం వేళ పసిపిల్ల ఏడుపులు విని గమనించిన స్థానికులు షాక్ కు గురయ్యారు. అప్పుడే పుట్టిన పసిపాపను బొడ్డును కూడా కత్తిరించకుండానే రక్తపు మరకలతోనే పేపర్లో చుట్టి వదిలేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ పసిపాపను అంగన్ వాడి టీచర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. సంబంధిత పసికందు మాక్లూర్ మండల కేంద్రంకు చెందిన వారా లేక ఇతర ప్రాంతం నుంచి వచ్చి వదిలేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

They got rid of it as a girl child

More articles

Latest article