24.1 C
Hyderabad
Monday, August 3, 2026

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను వేంటనే రద్ధు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

. . .  మాస్టర్ ప్లాన్ రద్ధు జివో జారీ చేయాలి

. . .  లేకుంటే ఉధ్యమం తీవ్రతరం

  కామారెడ్డి, బతుకమ్మ:

కామారెడ్డి పట్టణ విస్థరణను ఉద్ధేశించిన మాస్టర్ ప్లాన్ ను వేంటనే రద్ధు చేయాలని రైతు ఐక్య కార్యచరణ కమిటి ప్రతినిధులు డిమాండ్ చేశారు. సదాశివ నగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో అదివారం మాస్టర్ ప్లాన్ బాధితులు సమావేశమయ్యారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ లో చూపించిన గ్రీన్ జోన్, ఇండస్ట్రీయల్ జోన్ లలో  వ్యవసాయ భూములు చేర్చడాన్ని నిరశిస్తు ఎడాది కాలంగా 8 విలీన గ్రామాల రైతులు అందోళన చేస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వం కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్ధు చేస్తున్నమని ప్రకటించిన ఇప్పటి వరకు సంబంధిత గేజిట్ మాత్రం విడుధల కాలేదు. దానితో ఇటివల అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన శ్రీకాంత్ రెడ్డి అను రైతు అమరణ నిరహర దిక్ష చేపట్టగా రైతులు విరమింప చేశారు. ఈ నేపథ్యంలో రైతులు మరోసారి సమావేశమై ఖచ్చితంగా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రద్ధు చేయాలని ఈ విషయం  కామారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే లను కలిసి ప్రభుత్వం పై ఓత్తిడి తెవాలని నిర్ణయించారు. మాస్టర్ ప్లాన్ ను వెంటనే రద్దు చేస్తున్నట్టు జి. ఓ కాపీ జారీ చేయాలి. లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని రైతులు ప్రకటించారు.

The Kamareddy Master Plan should be canceled immediately

 

 

 

 

 

 

 

More articles

Latest article