- సహ దరఖాస్తుకు నిర్లక్ష్యపు సమాచారం
- కార్యదర్శిపై ఎంపీడీవో, డీపీవోకు ఫిర్యాదు
నిజామాబాద్ సిటి, బతుకమ్మ : పౌరులకు కల్పించబడ్డ చట్టబద్దమైన హక్కులను అందించడంలో గ్రామస్థాయి మొదలు జిల్లా స్థాయి, ప్రభుత్వ అధికారులు కూడా నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వారిపై ఉండే జవాబుదారితనాన్ని విస్మరిస్తూ అధికారాన్ని కాస్తా వాళ్ళ హక్కు అయినట్లు, అంతా వాళ్ళ ఇష్టమున్నట్లు నియంతల వ్యవహరిస్తున్నారు. ఇదే తరహాలో ఇటీవల నిజామాబాద్ జిల్లాలోని రూరల్ మండలం పరిధిలో ధర్మారం(ఎం) గ్రామ పంచాయితీలో ఓ సహ దరఖాస్తుదారుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆర్టీఐ కింద గ్రామ కార్యదర్శి పరిధిలోని సమాచారం కోసం దరఖాస్తు చేశాడు. అయితే దరఖాస్తుదారుడు కోరిన సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి జవాబు ఇవ్వాల్సి ఉండగా సదరు అధికారి సమాచారం ఇవ్వకూడదనా లేక దరఖాస్తుదారుడిని తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భాగంగా లబ్దిదారుడు కోరిన సమాచారం కాకుండా సంబంధం లేని జవాబు ఇచ్చారు. నిజామాబాద్ రూరల్ మండలం ధర్మారం గ్రామ పంచాయితీ కార్యాలయంలో సహా దరఖాస్తుదారుడు ఆరు అంశాల సమాచారం కోరి మాసం సమయం గడిచిపోయింది. కానీ పంచాయితీ కార్యదర్శి దరఖాస్తును చదువకుండానే ఆరు అంశాలకు బదులు 12 అంశాలను ఎన్ని పేజిలో చెప్పకుండానే రూ.1400 డీడీ కట్టమని రిప్లే ఇచ్చారు. పంచాయితీ కార్యదర్శి తన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించకుండా నిర్లక్ష్యపు సమాదానం ఇచ్చారని సహ దరఖాస్తుదారుడు నిజామాబాద్ రూరల్ మండల ఎంపీడీవో, జిల్లా పంచాయితీ అధికారికి పంచాయితీ కార్యదర్శిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు.

