31.2 C
Hyderabad

ఇలా వంతెన రోడ్డు వేశారు.. అలా తెగిపోయింది

Must read

📰 Generate e-Paper Clip

  • కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమా..!
  • ఎంబి రికార్డ్ చేసుకో..బిల్లులు తీసుకో..!
  • నిండు నిర్లక్ష్యానికి”వాటా”లే కారణమా..!
  • నాసిరకం పనుల నిర్మాణం పైన ప్రజల ఆగ్రహం

 

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయిస్టేషన్  నుండి ధర్పల్లి వెళ్లే రోడ్డు మార్గంలో లింగాపూర్ వాగు వద్ద నూతన బ్రిడ్జిని నిర్మించి డాంబర్ రోడ్డు తో రోడ్డు పనులను చేపట్టారు.రోడ్డు నిర్మాణం పనులు చేపట్టి సంవత్సరం గడవక ముందే నాసిరకం పనులు చేయడం వల్లే బ్రిడ్జికి పగుళ్లు, రోడ్డు తెగిపోయిందని ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రోడ్డు నిర్మాణం పనులలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా..ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమా..అనే విమర్శలు పెద్ద మొత్తంలో ప్రజల నుండి వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత పై అధికారులు ఎంబీ రికార్డ్ చేయడం వాటి బిల్లులు తీసుకోవడమే పనిగా పెట్టుకుని ఇలాంటి  సంఘటనలకు పాల్పడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు.నాసిరకం పనులలో నీకు..నాకు””వాటా””లే కారణమని ప్రజలు చర్చించుకుంటున్నారు.ఇటీవల మూడు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తుండడంతో కొన్ని రోజుల క్రితం వేసిన వంతెన రోడ్డు భారీ వర్షాలకు తేగిపోవడం పట్ల కాంట్రాక్టర్ పైన,ప్రజాప్రతినిధుల పైన ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. పెద్దపెద్ద నాయకులు అండతో కాంట్రాక్టర్లు నాసిరకం పనులు చేయడం షరామామూలే. నైపుణ్యంతో చేస్తే  డబ్బులు మిగిలేది ఎట్లా..అనే కోణంలోనే  వారు ఇలాంటిది ఘటనలకు పాల్పడతారని ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More articles

Latest article