27.1 C
Hyderabad

టమాటకు ధర లేక.. రైతన్నకు పెట్టుబడి రాక..

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్ బతుకమ్మ:   అకాల వర్షం టమాట పండించిన రైతులకు అపార నష్టాన్ని కలిగించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ కర్రీ వండిన టమాట ఉండవలసిందే. టమాట ధర రూ.10 కిలో అమ్ముతున్నారు. టమాట తెంపడానికి వస్తున్న కూలీలకు సరిపడ డబ్బులు కూడా రావడం లేదని రైతులు తమ గోడు వినిపిస్తున్నారు. ధరలు తగ్గిపోవడంతో టమాట పంట వేసిన రైతుకు గిట్టుబాటు ధర రాక జాతీయ రహదారి 44 పక్కన పారబోశారు. పంట కోసం పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో పంట వేసిన రైతులు తమకు నష్టం కలిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

More articles

Latest article