24 C
Hyderabad
Sunday, August 2, 2026

చదువుకు పేదరికం అడ్డు కాదు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : చదువుకు పేదరికం అడ్డు కాదని జాయింట్ ట్రాన్స్ ఫోర్ట్ కమీషనర్ హైదరాబాద్, రైడ్స్ శాశ్వత గౌరవ అధ్యక్షులు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 2000-2001 బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు రుద్రూర్ రైడ్స్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఉచిత వేసవి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆదివారం ఉచిత వేసవి శిక్షణ తరగతుల ముగింపు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ..విద్యతోనే విద్యార్థుల భవిష్యత్తు ఉంటుందన్నారు. విద్యార్థులకు రైడ్స్ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ ట్రాన్స్ ఫోర్ట్ కమీషనర్ హైదరాబాద్, రైడ్స్ శాశ్వత గౌరవ అధ్యక్షులు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, స్పెషల్ జుడిషియల్ మెజిస్ట్రేట్  ఆఫ్ సెకండ్ క్లాస్ బోధన్ శేష తల్ప సాయి, ఎంఈఓ కట్ట శ్రీనివాస్ రావు, గ్రామ పెద్దలు వెంకటేశ్వరరావు దేశాయ్, బచ్చు రాము, రైడ్స్ అధ్యక్షులు కర్రోళ్ల కృష్ణ ప్రసాద్, రైడ్స్ పూర్వ విద్యార్థులు, ఇందూర్ హై స్కూల్ కరస్పాండెంట్ కొడాలి కిషోర్ కుమార్,  మాజీ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్, రైడ్స్ సభ్యులు పత్తి రాము, బద్దం సంజీవ్ రెడ్డి, వెంకటేష్, తోట్ల గంగారాం, పూర్వ విద్యార్థులు, విద్యార్ధినీలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article