రెండో శనివారం విద్యాసంస్థలకు సెలవు లేదు

0 1,950

 . . . జిల్లా విద్యాశాఖాధికారి దుర్గా ప్రసాద్

 నిజామాబాద్, బతుకమ్మ :  

ఈ నెల 14న రెండో శనివారం నాడు విద్యాసంస్థలకు సెలవు లేదని అరోజు  తరగతులు యదావిదిగా నిర్వహించ బడుతాయని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి దుర్గా ప్రసాద్ తెలిపారు. ఈ నెల 2న రాష్ర్ట ప్రభుత్వం భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. అరోజు నాటి విద్యా సంవత్సరం సెలవును రెండో శనివారం నాడు అన్ని యాజమాన్య విద్యాసంస్థలు ఐనా పాఠశాలలు, కాలేజీలు, పాలిటేక్నిక్, ఐటిఐలతో పాటు యూనివర్సిటిలను తెరిచి ఉంచాలని ప్రభుత్వం అదేశించిందని తెలిపారు. ఈ విషయంను విద్యాశాఖాధికారులు, విద్యార్ధుల తల్లిధండ్రులు గమనించాలని అదేశించారు.

Leave A Reply

Your email address will not be published.