28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సీసీ రోడ్లు, డ్రైనేజీలకు ప్రతిపాదనలు

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్, బతుకమ్మ :   వేల్పూర్ మండలం పడగల్ లో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. గ్రామంలోని డ్రైనేజీలు, సీసీ రోడ్లను పరిశీలించారు. అలాగే రోడ్లు, డ్రైనేజీలు లేని ప్రాంతాల్లో నిర్మాణం కోసం రూ.53లక్షల 50వేల సీ ఆర్ ఆర్ నిధులతో పనులు చేపట్టాలని ప్రతిపాదనలు పంపించారు. ఆయన వెంట వేల్పూర్ పీఆర్ ఏఈ   శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలున్నారు.

బాధిత కుటుంబాలకు పరామర్శ

బాల్కొండ, బతుకమ్మ: మెండోరా మండలం పోచంపాడ్ గ్రామ పంచాయతీ కార్మికుడు సయ్యద్ వస్సియొద్దీన్ అనారోగ్యంతో మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు. అనంతరం నెహ్రునగర్, పోచంపాడ్ గ్రామాల్లో ఉన్న ఎస్సీ కాలనీల్లో రోడ్లను పరిశీలించారు. సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  వారి వెంట కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ కొత్తింటి ముత్యం రెడ్డి, కోప్పెల మోహన్ రెడ్డి, రొట్టె సంతోష్ కుమార్, అంగరి చందు, మాజీ సర్పంచ్ రమేశ్, మైలారం శ్రీను, ఆసిఫ్, అర్జున్, బాలు, శాంతిలాల్ తదితరులున్నారు.

More articles

Latest article