27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అక్లూర్ లో  ఏడిళ్లలో చోరీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, వేల్పూర్: మండలంలోని అక్లూర్ గ్రామంలో  సోమవారం అర్ధరాత్రి  ఏడు ఇళ్లల్లో దొంగల బీభత్సం సృష్టించారు.  గ్రామంలో శ్రీ ఆనంద రాజరాజేశ్వర ఆలయం వార్షికోత్సవ సందర్భంగా పలువురు గుడి వద్ద భజనలో నిమగ్నమయ్యారు. ఇది గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇండ్లలో చొరబడి దొచుకెళ్లారని స్థానికులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజాము పోలీసులకు సమాచారం అందండంతో ఎస్సై సంజీవ్  తన పోలీస్ సిబ్బందితో చేరుకొని ఇళ్లను పరిశీలించారు. ఎస్సై సంజీవ్ తెలిపిన వివరాల ప్రకారం ఎస్సీ కాలనీలో ఏడు ఇళ్లలో దొంగలు నగదు రూ.50వేలు, తులం బంగారు ఆభరణాల దొంగలించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంజీవ్ పేర్కొన్నారు..

More articles

Latest article