27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

పట్టణ గౌడ సంఘం కల్లుబట్టిపై టాస్క్  ఫోర్స్ దాడి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి కల్లును విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు నిజామాబాద్ పట్టణ గౌడ సంఘం కల్లుబట్టిపై దాడులు  నిర్వహించారు. మంగళవారం సాయంత్రం నగరంలోని కంఠేశ్వర్ కల్లుబట్టిపై నిజామాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ సింధూశర్మ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ ఆంజయ్య ఆధ్వర్యంలో సీసీఎస్, టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు  నిర్వహించారు. ఈ దాడిలో వెయ్యి లీటర్ల కల్లును స్వాధీనం చేసుకుని, కల్లుబట్టి  నిర్వాహకుడు బండారి రవి గౌడ్ ను అదుపులోకి తీసుకున్నారు. కల్లును ,  రవిగౌడ్ ను మూడవ టౌన్ పోలీసులకు అప్పగించారు.

More articles

Latest article