నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని 3వ టౌన్ పరిధిలో గల చంద్రశేఖర్ కాలనీలో గల ఎస్ బిఐ ఏటీఎం సెంటర్ లో చోరి యత్నం జరిగింది. ఏటీఎంలో చోరి చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్ కట్టర్ లతో మంగళవారం తెల్లవారుజామున ఏటీఎం సెంటర్ లోకి ప్రవేశించారు. గ్యాస్ కట్టర్ లతో ఏటీఎం మిషన్ ను కట్ చేసేందుకు యత్నించగా ఏటీఎం అలరాం అలర్ట్ మేసెజ్ స్థానిక పోలీసులకు అందింది. హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకోగానే అగంతకులు ఈకో వ్యాన్ లో పరారీ అయ్యారు. సంబంధిత వ్యాన్ ను పాల్ధా గ్రామ శివారులో వదిలేసి పారిపోయారు. పారిపోయిన అగంతకుల కోసం పోలీసు శాఖ ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. అంతర్ రాష్ట్ర ఏటీఎంల చోరి మూఠనే ఉంటుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈకో వ్యాన్ ఆధారంగా విచారణ చేస్తున్నారు.
- ఏటీఎం సెంటర్ ను పరిశీలించిన పోలీసు కమిషనర్..
నగరంలోని మూడవ టౌన్ పరిధిలో గల చంద్రశేఖర్ కాలనీలో గల ఎస్ బిఐ బ్యాంక్ సెంటర్ లో చోరి యత్నం ఘటన స్థలాన్ని నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్య పరిశీలించారు. స్థానికంగా సీసీ కెమెరాల పుటేజిలను పరిశీలించారు. సీసీఎస్ టీం ద్వారా దొంగలను పట్టుకునేందుకు కేసు పరిశోధనకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలసు కమిషనర్ తో పాటు నగర సిఐ శ్రీనివాస్ రాజు, 3వ టౌన్ ఎస్సై హరిబాబు తదితరులున్నారు.