బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణ కేంద్రంలోని 12 వ వార్డులో శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ తల్లి ఆలయంలో జరిగిన బోనాల పండుగలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు బోనం ఎత్తుకొని అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారి దీవెనలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని,ప్రతి ఒక్కరికి ఆ తల్లి దీవెనలు లభించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ బోనాల పండుగలో బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

