28.2 C
Hyderabad

రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచులు గ్రామపంచాయతీ కార్యాలయాల ఎదుట జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకరికొకరు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందల్వాయి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బాలయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి అనంతరావు జెండాను ఆవిష్కరించారు. ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ సుమలత జాతీయ జెండాను ఎగురవేశారు. అటవీ రేంజ్ కార్యాలయం వద్ద అటవీ రేంజ్ అధికారి రవిమోహన్ భట్ జాతీయ జెండాను ఆవిష్కరించి, వందేమాతరం గీతాలాపన చేశారు. ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం సునీత జాతీయ జెండాను ఎగురవేయగా సిబ్బంది పాల్గొన్నారు. రాజకీయ పార్టీల కార్యాలయాల్లోనూ స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతల కిషన్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగురవేశారు. టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలువేరి గంగాధర్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. నల్లవెల్లి సింగిల్ విండో కార్యాలయంలో సహకార సంఘం చైర్మన్ నోముల శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఇందల్వాయి సహకార సంఘంలో చైర్మన్ గోవర్ధన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే మండలంలోని గ్రామ గ్రామాన ప్రభుత్వ పాఠశాలలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆయా ఉపాధ్యాయులు, అధికారులు ఆవిష్కరించారు. స్వాతంత్య్ర  సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ వేడుకలు ఉత్సాహంగా సాగాయి.

More articles

Latest article