28.2 C
Hyderabad

ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమే స్వాతంత్య్రం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందని, స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌బండ్ వద్ద యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనుబంధ శ్రామిక్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆర్ఎస్పీ పార్టీ జిల్లా కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్రం కోసం అమరులైన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ.12 వేల జీవనభృతిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ట్రాఫిక్ పోలీసుల వేధింపులను నిలిపివేయాలని కోరారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, జీవన వ్యయాల నేపథ్యంలో ఆటో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కటారి రాములు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యలను అత్యవసరంగా పరిష్కరించి వారికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రఫీ ఉద్దీన్, అబ్దుల్ ముజీబ్, పండరి, కృష్ణ, ఇర్ఫాన్, మహమ్మద్ నిజాముద్దీన్, మొహమ్మద్ అనీష్, పి. విట్టల్, ఇమ్రాన్, అక్రమ్ ఖాన్, అస్రాఫ్, అయ్యాబ్, అజ్జు తదితర ఆటో కార్మికులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article