రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
. . . ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచులు గ్రామపంచాయతీ కార్యాలయాల ఎదుట జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకరికొకరు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందల్వాయి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బాలయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి...