విద్యార్థులను డ్రైవర్ ను కొట్టిన ట్రాఫిక్ కానిస్టేబుల్

0 1,990

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ  :                                                                                                                                         

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్కూల్ నుంచి ఇంటికెళ్తున్న విద్యార్థులు బస్సులో నుంచి ఉమ్మివేయడంతో తన మీద పడడంతో కానిస్టేబుల్ విద్యార్థులను చితకబాదాడు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. నిజామాబాద్ నగరంలోని ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాలకు చెందిన విద్యార్థులు పదవ తరగతి ప్రత్యేక తరగతులను ముగించుకుని వెళ్తున్న పాఠశాల విద్యార్థులు తమ వద్ద మిగిలిన నీటిని బస్సులో నుంచి పారేశారు.  ఆ సమయంలో డ్యూటీలో కానిస్టేబుల్ మహేంధర్  పై విద్యార్థులు చల్లిన నీళ్లు పడ్డాయి. తనపై విద్యార్థులు ఉమ్మి వేశారని ఆరోపిస్తూ వారు వెళ్తున్న బస్సును ఏసీపీ  కార్యాలయం ముందు ఆపి విద్యార్థులను చేయి చేసుకున్నారు. అడ్డుకున్న డ్రైవర్ ను కూడా కొట్టాడు. దాంతో అక్కడ ట్రాఫిక్ జాం ఏర్పడింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉండగానే ఈ ఘటన జరిగింది.  సంఘటన స్థలానికి పోలీసు అధికారులు చేరుకుని గొడవ సద్దుమనిగిలే  చేశారు.

The constable who beat the student driver

Leave A Reply

Your email address will not be published.