24.1 C
Hyderabad
Monday, August 3, 2026

మలుపులు తిరుగుతున్న టీఎల్ఎం వ్యవహారం

Must read

📰 Generate e-Paper Clip

  • పైసలు తిరిగివ్వలేదు.. మెటీరియల్ సరఫరా చేయలేదు
  • నష్టపోతున్న 27 కేజిబివిల విద్యార్ధినీలు
  • టెండర్లు పిలువకుండా ఫర్మ్ కు డబ్బుల జమ చేయించిన అధికారులు
  • జిల్లా విద్యాశాఖ డిఇఓ, ఎసి, జిఇసీఓలకు సంచాలకుల నోటీసులు
  • నోటీసులతో సరిపెడుతారా కమీషన్లు నొక్కిన వారిపై చర్యలు తీసుకుంటారా

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తుంది. అవినీతిలో మిగితా శాఖలను పక్కన పెట్టి మరి విద్యాశాఖాధికారులు అందినకాడికి అందిన చోటల్లా దండుకుంటున్నారు. తాజాగా గతంలో డిఇఓ గా పనిచేసిన అధికారిపై వచ్చిన అవినీతి అక్రమాలపై ఏకంగా ఎసిబీ విచారణ జరుగడం కలకలం రేపుతోంది. ఇప్పటికే జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్ లు, సీనియర్ అసిస్టెంట్ లతో పాటు జూనియర్ అసిస్టెంట్ లు వివిధ పాఠశాలల అధికారులు హెడ్మాస్టర్ ల నుంచి వివరాలను సేకరించిన అవినీతి నిరోధక శాఖ డిఇఓ తో పాటు ఓ ఆర్జేడికి కుడా తాఖీదులు ఇవ్వడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహరం లో జిల్లా విద్యాశాఖ పరువు గంగలో కలిసింది. తాజాగా కేజీబీవీలకు సరఫరా చేసే టీచింగ్, లర్నింగ్ మెటీరియల్ కు సంబంధించి రూ.35 లక్షలను టెండర్లు పిలువకుండా ప్రైవేట్ ఏజేన్సీకి అప్పగించిన వ్యవహారంలో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు జిల్లా అధికారులకు సంజాయిషీ నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది.

నిజామాబాద్ జిల్లా ఇంటిగ్రేటేడ్ కలెక్టరేట్ కార్యాలయం(ఐడిఒసీ) లో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఉండగా అవినీతి, అక్రమాలకు అధికారులు, సిబ్బంది భయపడటం లేదు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను 27 కేజీబీవీలకు టిచీంగ్ లర్నింగ్ మెటీరియల్ అవసరమని వాటిని ప్రైవేట్ ఏజేన్సీ ద్వారా కొనుగోలు చేయాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా కామారెడ్డికి చెందిన ఓ ఏజేన్సీ ద్వారా కొనుగోలు చేయాడానికి సిద్ధపడ్డారు. దానికి గాను సాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు. కాని ఎలాంటి టెండర్లు పిలువలేదు( రూ.2.50 లక్షల విలువ దాటితే టెండర్లు పిలువాలి). కాని అవేమి పట్టించుకోకుండా సాంక్షన్ ఆర్డర్ తోనే తతంగం నడిపారు. జిఇసిఓ ద్వార 27 కేజిబివిల నుంచి ఏజేన్సీ కు రూ.35 లక్షలు చెల్లించారు. తరువాత విద్యాశాఖ సర్వ శిక్ష అభియాన్ ద్వార టిఎల్ఎం సరఫరా చేస్తామని ప్రకటించింది. దానితో అధికారులు ఏజెన్సీ నుంచి డబ్బులు తిరిగి రాలేదు. అదే విధంగా మెటీరియల్ రాలేదు. ఇప్పటి వరకు ఏజెన్సీ నిర్వాహకులకు విద్యాశాఖాధికారులు పలుమార్లు చెప్పిన డబ్బులు రాలేదు.. మెటీరియల్ సరఫరా కాలేదు. దానితో విద్యా సంవత్సరం ప్రారంభమై 70 రోజులు గడువడంతో విద్యార్ధినీలు నష్టపోతున్నారు. ఈ విషయంపై ఫిర్యాదులు రావడంతో జిల్లా విద్యాశాఖాధికారి, అసిస్టెంట్ కమిషనర్, జిఇసీఓలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.

నిజామాబాద్ జిల్లా విద్యాశాఖలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోనే టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ కోసం నిధుల మళ్లింపు వ్యవహరం ఇప్పుడు అతలా కుతలం చేస్తుంది. జిల్లా విద్యాశాఖాధికారుల అవినీతిపై జిల్లా ఉపాధ్యాయుల పోరాట సమితి ఇది వరకే ఫిర్యాదులు చేశారు. ప్రస్తుతం ఎసిబి విచారణ జరుగుతుండగా, తాజాగా టిఎల్ఎం నిధుల  మళ్లింపు విషయంలో అధికారుల వ్యవహారం పై సమగ్ర విచారణ చేయాలని విద్యాశాఖ సంచాలకులకు ఫిర్యాదుకు సిద్ధమౌతున్నారు. ఇదిలా ఉండగా టిఎల్ఎం నిధుల విషయంలో కమీషన్ ల దందా జరిగిందని, అందుకే ఏజేన్సీ నిర్వాహకులు డబ్బులు తిరిగి చెల్లించకపోవడం జరుగుతుందని, అదే సమయంలో టిఎల్ఎం సరఫరా లేకపోవడంతో విద్యార్థినీలు నష్టపోతున్నారు. ఈ విషయంలో బాధ్యులైన అధికారులకు మెమోలతో సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని  డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శంతన్, టిపిఆర్ టియూ గౌరవ అధ్యక్షులు క్రిపాల్ సింగ్ కోరుతున్నారు.

More articles

Latest article