27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మువ్వెన్నెల జెండా రెపరెపలు

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి, బతుకమ్మ :  ఇందల్వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో 79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు, తహసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ వెంకట్రావు,స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై సందీప్,ఐకెపి కార్యాలయంలో ఏపీఎం  సునీత,ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో జెండాలాను ఎగరవేశారు.అనంతరం జాతీయ గీతాలపన చేశారు.

The three-month flag flutters.

వాడవాడలో.. 

మండల కేంద్రంలోని గ్రామాలలోని ఇందల్వాయి గ్రామంలో పిఎసిఎస్ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి భరత్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు జెగ్గ ప్రవీణ్ లు మువ్వన్నెల జెండాను ఎగరవేశారు.ఈ కార్యక్రమంలో  కోరట్పల్లి ఆనంద్,మోచ్చె గోపాల్, మహేందర్,ఈర్ల సాయందర్,బైరి రవి,దశరథ్,కడారి,తుప్ప సాయిబాబా,తొగరి నర్సయ్య, జెగ్గ రాములు,తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్, బిజెపి, పార్టీల ఆధ్వర్యంలో..

మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూర్ నవీన్ గౌడ్, బిజెపి పార్టీ మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ జెండా ఎగరవేశారు,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్,బిజేపి పార్టీలా సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

దళిత సంఘాల ఆధ్వర్యంలో..

మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాజ్యాంగ  రచయిత,నిర్మాత  డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు  మండల మాజీ అధ్యక్షులు కిష్టయ్య,నాయకులు తొగరి నరసయ్య, పాశం చిన్న నరసింహులు,ఉండ్రగు గంగారం, దాసరి శంకర్,ఆసది లింగంలు, పూలమాలలు వేశారు.

The three-month flag flutters.

More articles

Latest article