మువ్వెన్నెల జెండా రెపరెపలు
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో 79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు, తహసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ వెంకట్రావు,స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై సందీప్,ఐకెపి కార్యాలయంలో ఏపీఎం సునీత,ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో జెండాలాను ఎగరవేశారు.అనంతరం జాతీయ గీతాలపన చేశారు. వాడవాడలో.. మండల కేంద్రంలోని గ్రామాలలోని ఇందల్వాయి గ్రామంలో పిఎసిఎస్ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి భరత్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు జెగ్గ ప్రవీణ్...