- గ్రాడ్యుయేట్ల ఓటింగ్ 70.48 శాతం
- ఉపాధ్యాయుల పోలింగ్ 92.17 శాతం
నిజామాబాద్, బతుకమ్మ :
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల లెక్కను అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 27న జరిగిన పోలింగ్ లో గ్రాడ్యుయేట్ల ఓటింగ్ 70.48 శాతం, ఉపాధ్యాయుల పోలింగ్ 92.17 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి తెలిపారు.
పట్టభద్రుల ఓటింగ్ వివరాలు
కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో 6137 ఓటర్లకు గాను 4546 మంది ఓట్లు వేశారు. మంచిర్యాల్ లో 30921కి గాను 20821 మంది, ఆదిలాబాద్ లో 14935కు గాను 10397 మంది, నిర్మల్ జిల్లాలో 17141 మంది ఓటర్లకు గాను 12445 మంది ఓట్లు వేశారు. నిజామాబాద్ లో 31574కు గాను 24373 మంది, కామారెడ్డి జిల్లాలో 16410కి గాను 12820, జగిత్యాల్ లో 35281కి గాను 24862, పెద్దపల్లిలో 31037కు గాను 21256, కరీంనగర్ లో 71545కు గాను 46106, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 22397కు గాను 15394, సంగారెడ్డిలో 25652కు గాను 18775, మెదక్ లో 12472కు గాను 9384, సిద్దిపేట్ లో 32589కు గాను 23756, హన్మకొండలో 4585కు గాను 3419, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2423కు గాను 1974 మంది ఓట్లు వేశారు. మొత్తం 15 జిల్లాలో 355159 ఓటర్లకు గాను 250328 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 70.48 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
టీచర్ ఓటింగ్ వివరాలు . . .
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 15 జిల్లాలో 27088 మంది ఓటర్లకు గాను 24958 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా పోలింగ్ శాతం 92.17గా నమోదైంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 470కు గాను 425 మంది, మంచిర్యాల్ లో 1664కు 1527, ఆదిలాబాద్ లో 1593కు గాను 1478, నిర్మల్ లో 1966కు గాను 1685, నిజామాబాద్ లో 3751కు 3468, కామారెడ్డిలో 2011కు గాను 1883, జగిత్యాల్ లో 1769కు గాను 1635, పెద్దపల్లి జిల్లాలో 1111కు గాను 1049, కరీంనగర్ లో 4305కు గాను 3871, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 950కు గాను 900, సంగారెడ్డిలో 2690కు గాను 2490, మెదక్ లో 1345కు గాను 1280, సిద్దిపేట్ లో 3212కు గాను 3046, హన్మకొండలో 166కు గాను 154, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 83 మందికి గాను 73 మంది టీచర్లు ఓట్లు వేశారు.
