30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎం.బాలయ్య

 

భీంగల్, బతుకమ్మ : ఇన్ సర్వీస్ టీచర్లందరూ రెండేళ్ళలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులు కావాలని లేదంటే ఉద్యోగం నుండి తొలగించాలని సుప్రీంకోర్టు ఈ నెల 1 న ఇచ్చిన తీర్పుపై ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎం. బాలయ్య రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  భీమ్గల్ మండలంలోని వివిధ పాఠశాలలలో సభ్యత్వ నమోదు చేయించడం జరిగింది. వివిధ పాఠశాలలలో ఏర్పాటైన సమావేశంలో బాలయ్య మాట్లాడుతూ ఐదు ఏళ్లకు ఒకసారి ఉద్యోగుల కు, ఉపాధ్యాయులకు వేతన సవరణ జరగవలసి ఉంటుందని ఏడు సంవత్సరాలు గడిచిన కూడా వేతన సవరణ కొరకు ఏర్పాటు చేయబడిన పిఆర్సి కమిషన్ రిపోర్టు తెప్పించుకోవడం గాని దాని అమలు కొరకు చర్యలు తీసుకోవడం గాని రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదని తక్షణమే రిపోర్టు తిప్పించుకొని జూలై 2023 నుండి అమలు చేయాలని అన్నారు. ఎన్నడూ లేని విధంగా ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయని వాటిలో కనీసం రెండు డిఏలు తక్షణమే మంజూరు చేయాలని , ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్య పరిష్కరించి ఎంఈఓ, డిప్యూటీ డి ఓ, జూనియర్ కళాశాల లెక్చరర్ లకు పదోన్నతులు ఇవ్వాలని, కేజీబీవీ లో పని చేస్తున్న ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని, మోడల్ స్కూల్, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయుల దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉంటున్న సమస్యల పరిష్కరించాలని, 5571 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టుల ను మంజూరు చేసి పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని, 398 రూపాయల వేతనంతో పని చేసిన స్పెషల్ టీచర్ల సర్వీస్ కాలానికి ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, అన్ని ప్రభుత్వ పాఠశాలలో నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించాలని, ప్రభుత్వం హామీ పడినట్లు కేజీ టు పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందించుటకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా చెంగల్, బడా భీంగల్, గోను గోపుల, జాగిర్యాల తదితర పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. మండల పర్యటనలో భీంగల్ మండల అధ్యక్షులు జాన్ విల్సన్, ప్రధాన కార్యదర్శి గట్టు ఈశ్వర్ జిల్లా ఉపాధ్యక్షులు పి.దాసు, జిల్లా కార్యదర్శి ఎస్.కె మదర్ పాల్గొన్నారు.

More articles

Latest article