25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి సూచించారు. ఎస్ఐఆర్ పురోగతిపై సోమవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీఎల్ఓలు, సూపర్వైజర్లు ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ అర్హులైన ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని మంగళవారం లోపు పూర్తి చేయాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాలను పూరించే విషయంలో ఓటర్లకు సహకరించేలా పట్టణ ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, వివరాల డిజిటలైజేషన్ సమాంతరంగా జరిగేలా చూడాలన్నారు. ముఖ్యంగా బీఎల్ఓ సూపర్వైజర్లు ఎన్యూమరేషన్ ఫారంల స్క్రూటినీలో అప్రమత్తంగా ఉంటూ కీలకంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారంపై ఓటరు సంతకం, లేటెస్ట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, బీఎల్ఓ సంతకం ఉందా లేదా అన్నది క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.

 

The special comprehensive revision process must be expedited.

 

పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను కూడా నిర్ణీత గడువు లోపు పూర్తి చేసి వివరాలు పంపాలన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు అందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 96 శాతం పూర్తయిందని, నిజామాబాద్ అర్బన్ లో కూడా మంగళవారం వరకు పూర్తి చేస్తామని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఓటర్లకు సహకరించేలా నిజామాబాద్ నగరంలో సర్కిల్ వారీగా హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశామని అన్నారు. ఓటర్ల నుండి ఎన్యూమరేషన్ ఫారంల సేకరణ జరుపుతూ డిజిటలైజ్ చేయిస్తున్నామని, ఇప్పటికే 16శాతం పూర్తయ్యిందని సీ.ఈ.ఓ దృష్టికి తెచ్చారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని నిర్ణీత గడువు లోపు పూర్తి చేయడంలో బీఎల్ఓ సూపర్వైజర్లు, ఏఈఆర్ఓలు అంకిత భావంతో కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌ లో అదనపు కలెక్టర్ భుజంగరావు, సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డీపీఓ శ్రీనివాస్ రావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

The special comprehensive revision process must be expedited.

More articles

Latest article