28.2 C
Hyderabad

నాటు తుపాకుల కలకలం

Must read

📰 Generate e-Paper Clip

  • రాంపూర్‌ గ్రామంలో రెండు నాటు తుపాకులను స్వాధీనం

 

బాన్సువాడ, బతుకమ్మ  : బాన్సువాడ మండలం చిన్న రాంపూర్‌ గ్రామంలో ఓ వ్యక్తి వద్ద రెండు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ అశోక్‌ తెలిపారు.పక్కా సమాచారంతో ఎస్సై మోహన్‌ ఆధ్వర్యంలో నిందితుడి ఇంటిపై దాడి చేశామన్నారు. చిన్న రాంపూర్‌ గ్రామానికి చెందిన ఇస బిన్‌ సయ్యద్‌(40) తన పూర్వీకుల నుంచి వచ్చిన రెండు నాటు తుపాకులను అడవి జంతువులను వేటాడేందుకు ఉపయోగిస్తున్నట్లు పెర్కొన్నారు. వాటిని స్వాధీనం చేసుకొని, నిందితుడిపై కేసు నమోదు చేశామని తెలిపారు.

More articles

Latest article