26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఎల్ఆర్ఎస్ పేరిట 20 వేల కోట్ల వసూళ్లకు ప్లాన్

Must read

📰 Generate e-Paper Clip

  • ఎల్ఆర్ఎస్ పై మాటతప్పిన సీయంతో పాటు మంత్రులు రాజీనామా చేయాలి
  • పసుపు ధర విషయంలో బీజేపీ, కాంగ్రెస్ లు రైతులను మోసం చేశారు
  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ సిటి, బతుకమ్మ: ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి ఎల్ఆర్ఎస్ పేరు మీద వసూళ్లకు తెర లేపి 20 వేల కోట్ల వసూళ్లకు ప్లాన్ వేశారు అని మాజీ మంత్రి,  బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతు.. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ దోచుకోవడానికి, దాచుకోవడానికి ఎల్ఆర్ఎస్ తీసుకువచ్చారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒక్క రూపాయి తీసుకోకుండా రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పి మాటాతప్పారని అన్నారు. ఎల్ఆర్ఎస్ మీదా మాటా తప్పిన సీయం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ కు అప్లై చేసిన వాళ్లు డబ్బులు కట్టవద్దని వారి తరుపున బిఆర్ఎస్ అసెంబ్లీలో కొట్లాతుందని అన్నారు. బిజేపి నామ మాత్రపు ఎంఎస్ పి లేని పసుపు బోర్డు పెట్టి పసుపు రైతులను మోసం చేసిందన్నారు. మేము అధికారంలోకి వస్తే పసుపు కు క్వింటాలుకు 12000 రూపాయల మద్దతు ధర ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. పాలకవర్గం, అధికారులు, దళారులు కుమ్మక్కు కావడం వల్ల ఈ సీజన్ కు క్వింటాలుకు రూ. 13,000 పలికిన పసుపు రూ. పదివేలకు పడిపోయిందని అవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ లు  ముఖ్యమంత్రి ని కలసి ఇచ్చిన హామీ ప్రకారం పసుపును మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వండి అని అడగాలని డిమాండ్ చేశారు. ఎంపి అరవింద్, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి లు ప్రధానిని కలిసి రూ. 15 వేల మద్దతు ధర ఇచ్చే బోర్డు కావాలని డిమాండ్ చేయాలి. వడ్లు కొన్నట్టు కొనుగోలు కేంద్రాలు పెట్టి క్వింటాలకు 15 వేలతో పసుపును ప్రభుత్వమే కొనాలని ప్రశాంత్ రెడ్డి కోరారు.

More articles

Latest article