29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

రక్తబంధం కన్నా ఆత్మబంధం చాలా గొప్పది

Must read

📰 Generate e-Paper Clip

  •  15 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల కలయిక

 

భీమ్‌గల్ , బతుకమ్మ : సృష్టిలో అన్ని బంధాల్లోకెళ్ళ ఆత్మ బంధం గొప్పదని ప్రధానోపాధ్యాయులు అశోక్ అన్నారు. శుక్రవారం దశగౌడ్ ఫామ్ హౌస్ లో మండలం లోని పల్లికొండ హైస్కూల్ కు చెందిన 2009-10ఏస్సేస్సి బ్యాచ్ విద్యార్థులు నిర్వహించుకొన్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు.గురు శిష్యుల బంధం కుటుంబ బంధం కంటే గొప్పదని ఆయన అన్నారు. 15 యేండ్లు గడిచిపోయిన గురువులైన మమ్మల్ని మర్చిపోకుండా గుర్తుంచుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా విద్యను బోధించిన ప్రధానోపాధ్యాయుడు అశోక్, ఉపాధ్యాయులు, ప్రవళిక, ప్రేమలత, దేవానంద్, రవి, శోభ, గీత, మోహన్, సురేందర్, శ్రీనివాస్,గణేష్, గణేష్, శ్రీధర్, అనిల్ కుమార్, ధర్మపురి, మహేందర్, సంజీవ్  మోహన్ లకు ఘనంగా శాలువ పూలమాలతో సన్మానించారు. పూర్వ విద్యార్థులందరూ ఒకచోట కలిసి బాల సంస్కృతిని గుర్తు చేసుకొని,సాయంత్రం వరకు కలిసిమెలిసి డ్యాన్స్ చేస్తూ ఆనందంగా గడిపారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, సయ్యద్ అత్తరుద్దీన్, తూర్పు బాలకృష్ణ, ప్రశాంత్, సుఖేష్, నరేష్, వికాస్, భాను, వివేకానంద్, శ్యామ్, వంశీ, కార్తీక్, మధు, సౌమ్య, గంగా లక్ష్మి, అనూష, సింధు, ప్రవళిక, జ్యోతి, ప్రసన్న, అపర్ణ, అమూల్య, సోనీ, సౌందర్య, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Atmanbandhan is more than blood tie

More articles

Latest article