26.2 C
Hyderabad
Monday, August 3, 2026

అవమానించిందని అత్తను హత్య చేసిన అల్లుడు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

తరుచూ దొంగ అంటూ, ఇంటికి రావొద్దని అవమానించిన అత్తను అల్లుడు హత్య చేశాడు. ఈ నెల 3న నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్ లో జరిగిన హత్య కేసును పోలీసులు చేదించారు. నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్ ఆదివారం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 3న రాత్రి సమయంలో సారంగాపూర్ గ్రామంలో దుబ్బాక సాయమ్మను అల్లుడు లక్ష్మణ్ ముందుగా లేస్ తో ఉరి వేసి స్ప`హ తప్పిన ఆమెపై రోకలి బండతో కొట్టి హత్య చేశాడు. సాయమ్మ కూతురు ఫిర్యాదు చేయడంతో లక్ష్మణ్ పై అనుమానంతో రెండు రోజులుగా గాలించి ఆదివారం సారంగాపూర్ లో పట్టుకున్నట్లు తెలిపారు. 30కిపైగా దొంగతనాల కేసులున్న లక్ష్మణ్ పై అత్త సాయమ్మకు సదాభిప్రాయం లేదు.  సారంగాపూర్ లోనే ఉండే రెండవ కూతురు భర్త అయిన లక్ష్మణ్ ను  ఇంటికి రావొద్దని ఖరాఖండిగా చెప్పడంతో పాటు నీవు దొంగవని పలుమార్లు అనడంతో ఆమెను హత్య చేయాలని లక్ష్మణ్ నిర్ణయించుకున్నాడని సిఐ తెలిపారు. పథకం ప్రకారమే ఆమె ఒంటరిగా ఉంటున్న ఇంట్లోకి రాత్రివేళ ప్రవేశించి హత్య చేసి ఆమె బంగారు ఆభరణాలను దొంగలించుకపోయారని తెలిపారు. ఎక్కడా పోలీసులు గుర్తించకుండా ఆనవాళ్ళను చెరిపే ప్రయత్నం చేశారని తెలిపారు. లక్ష్మణ్ ను అరెస్టు చేసి బంగారు ఆభరణాలను రికవరి చేశామని, కేసును చేదించడంలో నిజామాబాద్ 6వ టౌన్ ఎస్సై వెంకట్ రావు, మోపాల్ ఎస్సై యాదగిరి గౌడ్ లు కష్టపడి పని చేశారని, వారికి ఏసీపీ అభినందించినట్లు సిఐ తెలిపారు.

More articles

Latest article