- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం
- నలుగురు ఉపాధ్యాయులపై వేటు
- కర్ణాటకకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు
- ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసిన పోలీసులు
- నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలింపు
- నిజాంసాగర్ నవోదయలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు, ఆలస్యంగా వెలుగులోకి…
- బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్త పడ్డ వైస్ ప్రిన్సిపల్
- వైస్ ప్రిన్సిపల్ పై కేసు నమోదుకు సిద్ధమవుతున్న పోలీస్ శాఖ
నిజాంసాగర్, బతుకమ్మ: ఎంతో పట్టుదలతో చదివి నవోదయ విద్యాలయంలో సీటు సాధించుకొని.. ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థినులు నవోదయ విద్యాలయంలో అడుగుపెడితే.. అక్కడ కొంతమంది కీచక ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం.. దీనిని వైస్ ప్రిన్సిపల్ వెనుక వేసుకుని రావడం జరుగుతున్న తీరు. చక్కని విద్య బోధించి తమ కన్న పిల్లల్లాగా చూసుకోవలసిన ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం విద్యార్థుల మనోభావాలకు దెబ్బతీస్తున్నారు. ఇప్పటికే పలు విద్యాసంస్థ లో కీచక ఉపాధ్యాయుల లీలలు వెలుగు చూశాయి. తాజాగా కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ నవోదయ విద్యాలయంలో గతంలో రెండు, మూడు సార్లు విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించడం, ఈ విషయం విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పడం, తల్లిదండ్రులు వచ్చి ప్రశ్నించడంతో వైస్ ప్రిన్సిపల్ ఈ తంతాంగం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇదే ఆసరాగా తీసుకొని ఇటీవల మరోసారి విద్యార్థినిల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడడంతో విద్యార్థినులు, ఉపాధ్యాయుల పనితీరు పై, తల్లిదండ్రులకు వివరించ గా చివరకు విద్యార్థినుల లైంగిక వేధింపుల కేసు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో నలుగురు ఉపాధ్యాయులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు నిజాంసాగర్ పోలీసులు వెల్లడిస్తున్నారు. ఈ ఘటన వారం రోజుల క్రితం జరిగింది. పోలీసులు ఈ విషయాన్ని మీడియాకు దాచకుండా ఉండడంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. ఇప్పటికే రాష్ట్రంలో విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయులను, అధ్యాపకులను అరెస్టు చేసిన ఘటనలు వెలుగు చూశాయి. కానీ నిజాంసాగర్ నవోదయ విద్యాలయంలో మూడుసార్లు విద్యార్థుల పట్ల అసభ్యంగా ఉపాధ్యాయులు ప్రవర్తించిన తీరు వైస్ ప్రిన్సిపాల్ దృష్టికి విద్యార్థినిలు తీసుకుపోయినప్పటికీ, దానిని బయటకు పొక్కనివ్వకుండా వైస్ ప్రిన్సిపల్ జాగ్రత్త పడ్డారు. ఈ విషయంలో వైస్ ప్రిన్సిపల్ పై కూడా కేసు నమోదు చేయాలంటూ విద్యార్థి సంఘాల నుంచి డిమాండ్ వస్తుంది. తమ పరిధిలోని పాఠశాలలో విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తిస్తే, వారిపై కఠినంగా శిక్షించవలసిన వైస్ ప్రిన్సిపల్ వారిని వెనుక వేస్కరావడం పట్ల విమర్శులు వెల్లువెత్తుతున్నాయి.

