రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండలం అక్బర్ నగర్ నగర్ గ్రామ మాజీ సర్పంచ్ తిగుళ్ల గంగామణి వరప్రసాద్ సేవలు మర్చిపోలేనివని ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయురాలు, విద్యార్థులు, గ్రామస్తులు కొనియాడారు. గ్రామంలో గతంలో ప్రైమరీ పాఠశాలలో కేవలం ఐదుగురు విద్యార్థులచే విద్యనభ్యసించి పాఠశాలను కొనసాగించారు. పాఠశాలలో తరగతి గదుల కొరత ఉండడంతో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో మాజీ సర్పంచ్ తిగుళ్ల గంగామణి వరప్రసాద్ పాఠశాలలో తరగతి గదులతో పాటు పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందించారు. ఇప్పడు పాఠశాలలో సుమారు 75 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గ్రామ సర్పంచ్ గా విధులు నిర్వహిస్తూ కూడా విద్యార్థులకు మంచి విద్యాబోధనతో పాటు యోగా, క్రీడలలో శిక్షణ అందించి విద్యార్థులను చురుగ్గా తీర్చిదిద్దారు. అటు గ్రామానికి, ఇటు పాఠశాలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయురాలు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తు అభినందిస్తున్నారు.
