- పోచారం, ఏనుగు వర్గీయుల ఘర్షణ
- సమాచారం లేదని.. ఫ్లెక్సీలో ఫొటో లేదని..
- కాంగ్రెస్ పార్టీ నాయకుల నిరసన సెగ
బతుకమ్మ బాన్సువాడ : ఉమ్మడి జిల్లాలో విస్తరించిన బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఏనుగు రవీందర్ రెడ్డి వర్గానికి చెందిన యలమంచిలి శ్రీనివాస్ రావును కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరువాత జరిగిన తొలి సమావేశం రచ్చరచ్చైంది. బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ ,సంస్థ గత అబ్జర్వర్ వేణుగోపాల్ యాదవ్ హాజరయ్యారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులకు,మార్కెట్ కమిటీ అధ్యక్షులకు, వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీలో పని చేసినటువంటి నాయకులకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి కి కూడా సమాచారం ఇవ్వకుండా ఫ్లెక్సీలో ఫోటో పెట్టకుండా గులాబీ కాంగ్రెస్ వాళ్లతో సమావేశం నిర్వహించడం పట్ల కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల పనితీరుపై ఏనుగు వర్గీయులు మండి పడ్డారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల తీరును నిరసిస్తూ సమావేశం జరుగుతున్న హాల్ ముందు బాన్సువాడ కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బాన్సువాడ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నాయకుల కార్యకర్తలను ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు సముదాయించే యత్నం చేశారు. అయినప్పటికీ నిరసనకారులు నిరసన తెలిపారు.

