. . . నగర మేయర్ ఉమారాణి రమేష్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రతి చిన్నారి భద్రత మనందరి బాధ్యతని, చిన్నారులు ఎదగడంలో మనందరి భాగస్వామ్యం ఎంతో అవసరమని నిజామాబాద్ మేయర్ ఉమారాణి రమేష్ అన్నారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం నిజామాబాద్ ఆధ్వర్యంలో మంగళవారం డివిజన్/వార్డు బాలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మేయర్ హాజరై, బాలల హక్కుల పరిరక్షణ, వారి భద్రత, విద్య, ఆరోగ్యం, సంక్షేమంపై విలువైన సూచనలు అందించారు. సమాజంలోని ప్రతి చిన్నారి సురక్షితంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఎదగడం కోసం ప్రభుత్వం, ప్రజలందరి భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు. బాల రక్ష భవన్, మహిళా శిశు దివ్యాంగుల & వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా బాలల సంరక్షణపై మరింత అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిపిఎస్ సూపర్ వైజర్ స్వర్ణలత, చైల్డ్ లైన్ చైతన్య (డీసీపీఓ), జ్యోష్ణ, సావిత్రి, ఐకేపీ సిబ్బంది, ఆశా వర్కర్లు అంగన్ వాడీ సిబ్బంది పాల్గొన్నారు. చిన్నారులకు ఏ సమస్య వచ్చినా వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని కోరారు.
