ప్రతి చిన్నారి భద్రత మనందరి బాధ్యత

  . . . నగర మేయర్ ఉమారాణి రమేష్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రతి చిన్నారి భద్రత మనందరి బాధ్యతని, చిన్నారులు ఎదగడంలో మనందరి భాగస్వామ్యం ఎంతో అవసరమని నిజామాబాద్ మేయర్ ఉమారాణి రమేష్ అన్నారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం నిజామాబాద్ ఆధ్వర్యంలో మంగళవారం డివిజన్/వార్డు బాలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మేయర్ హాజరై, బాలల హక్కుల పరిరక్షణ, వారి భద్రత, విద్య, ఆరోగ్యం, సంక్షేమంపై విలువైన సూచనలు అందించారు....