నందిపేట్, బతుకమ్మ :
నందిపేట్ గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధి హామి పనులను గ్రామ సర్పంచ్ ఎర్రం సిలండర్ లింగం మంగళవానం స్వయంగా పరిశీలించారు. పనుల్లో పాల్గొంటున్న కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి మజ్జిక ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐరన్ టాబ్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తీవ్ర ఎండల సమయంలో కూలీలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు. గ్రామంలోని ప్రతి కార్మికుడి ఆరోగ్యం తమకు అత్యంత ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు.

