28.8 C
Hyderabad
Monday, August 3, 2026

దేశ అభివృద్ధిలో విశ్రాంత ఉద్యోగుల పాత్ర కీలకమైంది

Must read

📰 Generate e-Paper Clip

విశ్రాంత ఉద్యోగుల క్రీడా పోటీలను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దేశ అభివృద్ధిలో విశ్రాంత ఉద్యోగుల పాత్ర కీలకమైందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని ఖలీల్ వాడిలో గల విశ్రాంతి ఉద్యోగుల భవనంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నిజామాబాద్ జిల్లా స్థాయి ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల క్రీడా పోటీలను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆదివారం ప్రారంభించారు.

The role of retired employees is crucial in the development of the country

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశ అభివృద్ధిలో విశ్రాంత ఉద్యోగుల పాత్ర కీలకమైందన్నారు. వారు అందించిన సేవలను కొనియాడారు. విశ్రాంతి ఉద్యోగుల క్రీడా పోటీల ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ ఉర్దూ  అకాడమీ చైర్మన్ గారు తహర్ బిన్,  జిల్లా అధ్యక్షులు మామిడ్యాల రవీందర్,రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భోజ గౌడ్,బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్ కార్ లక్ష్మి నారాయణ, రిటైర్డ్ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

The role of retired employees is crucial in the development of the country

More articles

Latest article