కామారెడ్డి జిల్లా పర్యవేక్షకులు మంథని సామ్యెల్ మాదిగ
బాన్సువాడ, బతుకమ్మ : సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు కోసం మాదిగలు ఉపకులాలు మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఆసన్నమైందని కామారెడ్డి జిల్లా పర్యవేక్షకులు మంథని సామ్యెల్ మాదిగ పిలుపునిచ్చారు. బాన్సువాడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆదివారం బాన్సువాడ నియోజకవర్గంలోని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఎంఎస్ఎఫ్, అనుబంధ సంఘ సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేయి గొంతులు లక్ష డప్పులతో జనవరి 27 న మాదిగ ల మరో దండోరా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సామాజిక ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ముప్పై ఏళ్ల మాదిగల పోరాటం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా విజయం సాధించిదని అన్నారు. దాని అమలుకు అడ్డు పడుతూ కొంతమంది స్వార్ద పర సంపన్న మాల వర్గాలు కుట్రలు చేస్తున్నారని ఎంతమంది అడ్డు వచ్చినా వర్గీకరణ ఆగదని అందుకు యావత్తు మాదిగ జాతి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. దేశం లో ప్రపంచంలో తమ హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు జరిగాయి, జరుగుతున్నాయని అన్నారు. కానీ సోదర కులాలకు హక్కులు వద్దు అనే ఉద్యమాన్ని మాల సంపన్నులు చేస్తున్నారని దీనిని యావత్తు సమాజం గమనిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సత్తిగారి లక్ష్మి, బాలాపురం లావణ్య, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మెక్కా సాయి మాదిగ, విజయ్ మాదిగ, ఎంఆర్పీఎస్ బాన్సువాడ నియోజకవర్గ సీనియర్ నాయకులు గరుగళ్ళ బాలరాజ్, దాకయ్య, శివరాజ్, సాయిలు, గరుగళ్ల సాయిలు, బంగారు రవి, గంగాధర్, ఎర్రోళ్ల సాయిలు, రమేష్, ఎంఎస్ఎఫ్ నాయకులు టేకుర్ల శేఖర్, పవన్, సాయిలు, దత్తు, మహేష్ పాల్గొన్నారు.

