రుద్రూర్, బతుకమ్మ :
రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు పుటం పురుషోత్తమ రావు పటేల్ నిర్వహించిన నూతనంగా ఎన్నికైన మున్నూరు కాపు సర్పంచ్ ల సన్మాన కార్యక్రమం లో రుద్రూర్ గ్రామ సర్పంచ్ ఇందూర్ సునీత చంద్రశేఖర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు కే. కేశవరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంతరావు, శాసనసభ్యులు దానం నాగేందర్, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, ప్రముఖ విద్యావేత్త వి. ప్రకాష్, రాష్ట్ర మున్నూరు కాపు నాయకులు, రుద్రూర్ జై కిసాన్ మున్నూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి పార్వతి శేఖర్, రాష్ట్రం నలు మూలలనుండి ఎన్నికైన నూతన సర్పంచ్ లు పాల్గొన్నారు.
