28.8 C
Hyderabad
Monday, August 3, 2026

రాజ్యాంగ రూపశిల్పుల త్యాగాల ఫలితమే నేటి భారతం 

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిజామాబాద్ ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ 

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ  : 

 

భారత దేశ స్వాతంత్ర్య అనంతరం సామాన్యుల నుండి అసమాన్యుల వరకు సమాన హక్కులు లభించిన చారిత్రత్మాక రోజే గణతంత్ర దినోత్సవాళ్లని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. వి. ఎన్ భారత లక్ష్మీ అన్నారు.గణతంత్ర దినోత్సవం సందర్బంగా జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆమె మాట్లాడారు. బ్రిటిష్ వలస పాలకుల నుండి దేశానికి స్వాతంత్రం సమకూర్చడంలో స్వాతంత్ర్య సమరయోధులు ఎన్ని కష్టానస్టాలు పడ్డారో దేశానికి రాజ్యాంగ రూపకల్పనలో మరింత శ్రమించారని ఆమె తెలిపారు.రాజ్యాంగం అందరికి సమాన హక్కులు కల్పించి గౌరవంగా జీవించే అవకాశాలు కల్పించిందని అన్నారు. స్థానిక సంస్థల నుండి దేశ ప్రధానమంత్రి వరకు ఓటు అనే హక్కుతో ఎన్నుకునే విధానాన్ని రాజ్యాంగంలో పొందుపరచి ప్రజలలే ప్రభువులు అనే అధికారిక వ్యవస్థ నిర్మితమైందని ఆమె పేర్కొన్నారు. ప్రజల హక్కులకు ముప్పు ఏర్పడినప్పుడు, ముప్పును తొలగించడానికి కోర్టులు ముందున్న సందర్బాలు అనేకం ఉన్నాయని ఆమె వివరించారు. హక్కులు, బాధ్యతలు సమానంగా అనుభవిస్తూ దేశ నిర్మాణంలో భాగస్వాములం కావాలని ఆమె అకాక్షించారు.

. . .  బహుమతుల ప్రధానం

ఘనతంత్ర దినోత్సవం సందర్బంగా నిజామాబాద్ బార్ అసోసియేషన్, జిల్లా జ్యూడిషియల్ ఉద్యోగుల సంగం నిర్వహించిన క్రీడపోటీలలోని విజేతలకు జిల్లాజడ్జి భారత లక్ష్మీ, అదనపు జిల్లాజడ్జిలు శ్రీనివాస్, దుర్గా ప్రసాద్ బహుమతులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జిలు కుష్భూ ఉపాధ్యాయ, గోపికృష్ణ, చైతన్య హరి కుమార్, శ్రీనివాస్ రావు,బార్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, ఉపాధ్యక్షుడు సురేష్, క్రీడల కార్యదర్శి మంజిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

The result of the sacrifices of the constitutional architects

More articles

Latest article