కామారెడ్డి, బతుకమ్మ :
గణతంత్ర దినోత్సవం శుభ సంధర్భంగా ప్రతి పాఠశాలలో, కళాశాలలో, ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్ర పటం పెట్టి గణతంత్ర దినోత్సవం జెండా ఆవిష్కరణ చేయాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తోల గంగారాం అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అందుబాటులో లేని కారణంగా కార్యాలయం ఏవో ని మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. వారు మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవం రోజున చాలా చోట్ల బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్ర పటం పెట్టడం లేదని అలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి మల్లన్న, జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు సాప శివరాములు, తదితరులు పాల్గొన్నారు.