. . . అడిషనల్ కమిషనర్ కు సిపిఎం నగర కమిటీ వినతి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నగరంలోని 10 వ డివిజన్ లోని దొడ్డి కొమురయ్య కాలనీలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని సిపిఎం నగర కార్యదర్శి బెజగం సుజాత ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ రవిబాబు కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి బెజగం సుజాత మాట్లాడుతూ … దొడ్డి కొమురయ్య నగర్ లో నివసిస్తున్న వారికి ప్రభుత్వం బోరు వేసి మంచినీటి సౌకర్యం కలిపేయడం జరిగింది అదే క్రమంలో అక్కడ ఉంటున్న గల్లీ లీడర్ గా చలామణి అవుతున్న కొంతమంది నెలకు వంద రూపాయలు ఇవ్వాలని రిపేర్ డబ్బులు 200 రూపాయలు వసూలు చేస్తూ పేదలపై దౌర్జన్యాలు దాడులు చేస్తున్నారు కావున కార్పొరేషన్ అధికారులు వారిపై దృష్టి పెట్టి వారిని ప్రజల పైన దాడులు ధైర్యం చేయకుండా పరిష్కారం చేయాలని కోరారు. లేదంటే రేపు రానున్న రోజుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బస్తీ వాసులు. మంగళ్ బాయ్, రజియా, లక్ష్మి భాయ్, రేష్మ, సరో బాయ్, రబ్బాని, ఆసియా , అనూష బాయ్, ఆశ తదితరులు పాల్గొన్నారు
