సిరికొండ, బతుకమ్మ
కామ్రేడ్ పిట్ల ఎల్లన్న స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మిద్దామని సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర నాయకులు కామ్రేడ్ పి రామకృష్ణ పిలుపు ఇచ్చారు. మంగళవారం అమరుడు పిట్ల. ఎల్లన్న స్వగ్రామం మండలంలోని గడ్కోల్ గ్రామంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) మండల కమిటీ ఆధ్వర్యంలో 10వ, వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ అతివాదం తలకెక్కిన పీపుల్స్ వార్ ఆనాడు పిరికితనం తో దొంగ చాటుగా నిరాయుధుడు అయిన పిట్ల ఎల్లన్న ను కాల్చి చంపారన్నారు. ప్రపంచ చరిత్రలో ప్రజలు లేని విప్లవాలు ఎక్కడ విజయవంతం కాలేవని, కొంతమంది సాయిదులతో విప్లవోద్యమాలు పురోగతి చెందు లేవని, ఇది చరిత్ర చెప్పిన నిజమన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాయుధ పంథా నుండి ప్రజాపంథా మార్చుకుని విప్లవ ఉద్యమాలు నిర్మిస్తున్న ప్రజాపంథా రాజకీయాల వైపు అమరుడు కామ్రేడ్ పిట్ల ఎల్లన్న బలంగా నిలబడ్డాడన్నారు. ఇది అవునన్నా, కాదన్నా జగమెరిగిన సత్యం అన్నారు. ఇప్పటికైనా మారిన పరిస్థితి కనుగుణంగా సిపిఐ (ఎంఎల్) మావోయిస్టు పార్టీ బలమైన వర్గం పంథాను మార్చుకున్న ప్రజాపంథా రాజకీయాలు గుణంగా రావడం సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ (ప్రజాపంథా) విప్లవ రాజకీయాలే సరియైనవని స్పష్టమైనది అన్నారు. మిగతా సంస్థలు సైతం సరియైన రాజకీయాల వైపు నిలబడి విప్లవపార్టీల ఐక్యతను సాధించి దేశంలో విప్లవోద్యమాల విజయవంతానికి వాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అమరుడు కామ్రేడ్ పిట్ల ఎల్లన్న స్ఫూర్తిని తీసుకుని బలమైన విప్లవోద్యమాలను నిర్మించాల్సిన బాధ్యత మన పైన ఉందని ఆయన గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా నాయకులు ఆర్. రమేష్, డివిజన్ నాయకులు ఆర్. దామోదర్, బి కిశోర్, ఎం సాయి రెడ్డి,ఎం అనిస్, మండల నాయకులు ఎం లింబాద్రి, ఎస్ కిశోర్,ఎం నారగౌడ్,జె బాల్ రెడ్డి,జి కిరణ్,జి నర్సయ్య,పిట్ల చిన్న ఎల్లయ్య, జే రాజు, ఎస్. కె రఫిక్ తదితరులు పాల్గొన్నారు.
