26.2 C
Hyderabad
Monday, August 3, 2026

డీవీకె వర్ధంతి సభకు తరలిన మాస్ లైన్ నేతలు

Must read

📰 Generate e-Paper Clip

సిరికొండ, బతుకమ్మ :  హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించనున్న సిపిఐ(ఎంఎల్)ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి అమరుడు డివి కృష్ణ 3వ, వర్ధంతి సభకు  సిరికొండ మండలం నుండి మాస్ లైన్ పార్టీ నేతలు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈసందర్బంగా సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి.ప్రభాకర్ మాట్లాడుతు అమరుడు కామ్రేడ్ డివి కృష్ణ ఉద్యోగం వదిలిపెట్టి తన జీవతాంతం విప్లవొద్యమానికి అంకితం చేసిన గొప్ప నేత అన్నారు. సిరికొండ, సిరిసిల్ల ఉధ్యమాలకు గుండెకాయలా పని చేసాడని,బలమైన ఉద్యమాలను నిర్మించిన ఆణిముత్యం లాంటి కమ్యూనిస్ట్ నాయకుడన్నారు. ఆయనను స్మరించుకోవడం అంటే బలమైన విప్లవొద్యమాలను నిర్మించడమేనన్నారు. హైదరాబాద్ లో వర్ధంతి సభకు తరలి వెళ్లిన వారిలో పివోడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి. గోదావరి, సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ, జిల్లా నాయకులు ఆర్. రమేష్, వి. సత్తేవ్వ, ఏ. ప్రకాష్, డివిజన్ నాయకులు ఆర్. దామోదర్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article