భీమ్ గల్, బతుకమ్మ : ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తాలేవని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బుధవారం నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కవిత దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించి, రైతులకు మేలు చేేసే ప్రయత్నం చేయాలని కోరారు. తెలంగాణ ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భీమ్ గల్ మండలంలోని లింబాద్రి స్వామి ఆలయంలో పెద్ద ఉత్సవం జరుగుతుందని,స్వామి వారు మహిమ గల దేవుడని, స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చానని పేర్కొన్నారు. నిజానికి లింబాద్రి ఆలయం కాదు, నింబాద్రి అంటారని, కాలక్రమేణా లింబాద్రిగా పేరు వచ్చిందన్నారు. ఈదేవుడి దయ వల్ల నిజామాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరాాారు. పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మరో ముగ్గురు కార్పొరేషన్ ఛైర్మన్లు కూడా ఈ ప్రాంతం వారేనని, ఇక్కడ ఎమ్మెల్యే ఎవరన్నది పక్కన పెడితే.. రూలింగ్ పార్టీదే నడుస్తోందన్నారు. రైతులు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. మక్కలు 80 శాతం కొన్న తర్వాత ఇప్పుడు కాంటా పెడుతున్నారు. ఇది దారుణమన్నారు. తడిసిన ధాన్యం కూడా కొంటలేరని, కొంటామని కూడా చెప్పటం లేదన్నారు. ఇటీవల తాను యంచ గ్రామాన్ని సందర్శించిన తర్వాత కలెక్టర్ సందర్శించారని, అలాగే అన్ని చోట్లకు వెళ్లాలని కోరుతున్నానని వెల్లడించారు. ఈ ప్రాంతంలోని కొన్ని చెక్ డ్యామ్ లు డ్యామేజ్ అవటంతో బాల్కొండ ప్రాంతంలో పంట పొలాలు మునిగిపోయాన్నారు. ఆరైతులకు పంట నష్టం ఇస్తామని ప్రభుత్వం ధైర్యం చెప్పటం లేదున్నారు. కేసీఆర్ లక్ష్మీ నరసింహా స్వామి భక్తుడని గతంలో లింబాద్రి స్వామి ఆలయానికి రూ. 5 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. దాంతో గుడిని అభివృద్ధి చేసుకున్నామన్నారు. మహిళలకు టాయిలెట్స్, ఛేంజింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాల్సి ఉందని, గుట్ట కింద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ పూర్తి కావటానికి రూ. 20 లక్షలు అవసరమని ప్రభుత్వం కేటాయించాలని కోరారు. పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక దృష్టి పెట్టి ఆలయ అభివృద్ధి కి కృషి చేయాలని డిమాండ్ చేశారు.

