నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ మండలం కొండూరు గ్రామంలో శత చండీయాగం మహోత్సవం నాలుగో రోజైన గురువారం కొనసాగింది. ఈసందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఎంపీటీసీ రాజు, చాకలి సంతోష్, నిర్మల్ జిల్లా పంచ గూడ, ఆష్ట గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.