24.1 C
Hyderabad
Monday, August 3, 2026

మత్స్యకారుల ఆర్థిక బలోపేతమే లక్ష్యం

Must read

📰 Generate e-Paper Clip

చేప పిల్లలను చెరువులో విడుదల చేసిన ఎమ్మెల్యే
జుక్కల్, బతుకమ్మ : నిజాంసాగర్ మండలం పెద్ద ఆరేపల్లి గ్రామంలోని రిజర్వాయర్ లో ప్రభుత్వం మత్స్యకారులకు 100% సబ్సిడీపై అందజేస్తున్న ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చేప పిల్లల పెంపకంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తెలిపారు. దళారులు ఒక మాఫియాలాగా ఏర్పడి మత్స్యకారుల కష్టాన్ని దోచుకుంటున్నారని అన్నారు. అధికారులు చొరవ చూపి మత్స్యకారులకు లైసెన్స్ ఇవ్వడం వల్ల దళారులకు చెక్ పెట్టొచ్చని అన్నారు. మత్స్యకారులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని, మత్స్యశాఖ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.అదేవిధంగా నిజాంసాగర్ ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ , కాంగ్రెస్ నాయకులు తదితరులు ఎక్కువ మత్స్యశాఖ అధికారులు,మత్స్యకార నాయకులు , స్థానిక మండల నాయకులు పాల్గొన్నారు.

The objective is economic empowerment of fishermen

More articles

Latest article