మత్స్యకారుల ఆర్థిక బలోపేతమే లక్ష్యం

చేప పిల్లలను చెరువులో విడుదల చేసిన ఎమ్మెల్యే జుక్కల్, బతుకమ్మ : నిజాంసాగర్ మండలం పెద్ద ఆరేపల్లి గ్రామంలోని రిజర్వాయర్ లో ప్రభుత్వం మత్స్యకారులకు 100% సబ్సిడీపై అందజేస్తున్న ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చేప పిల్లల పెంపకంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తెలిపారు. దళారులు ఒక మాఫియాలాగా ఏర్పడి మత్స్యకారుల కష్టాన్ని దోచుకుంటున్నారని అన్నారు. అధికారులు చొరవ చూపి మత్స్యకారులకు లైసెన్స్...