- తొలుత లేకుండే… అభ్యంతరాల తర్వాతనే
- బదిలీ కాకుండానే అయినట్లు
నిజామాబాద్, బతుకమ్మ : విద్యుత్ శాఖలో బదిలీలలో రోజుకో పరిణామం చోటు చేసుకుంటుంది. గత నెల 28న ప్రదర్శించిన బదిలీల జాబితాలో ట్రేడ్ యూనియన్ నాయకుని పేరు లేకపోవడం వివాదాస్పదం అయింది. దీనికి సంబంధించిన అధికారిని మరో యూనియన్ నాయకులు నిలదీశారు. ఎన్నికల సమయంలో బదిలీ కావడం వల్ల నాయకుని పేరును తొలగించాల్సి వచ్చిందని చెప్పారు. ఇదే విషయం రాతపూర్వకంగా ఇవ్వాలని పట్టుబట్టడంతో ఈ వివాదం ఎస్ఈ చెంతకు చేరింది. దీనిపై వరంగల్ కంపెనీ కార్యాలయం నుంచి వివరణ తీసుకోవాలని ఎస్.వి రవీందర్ సంబంధిత అధికారున్ని ఆదేశించారు. కంపెనీ నుంచి వచ్చిన వివరానుకూలంగా మలి జాబితా(సెప్టెంబర్ 30న)లో ట్రేడ్ యూనియన్ నాయకుని పేరు ప్రత్యక్షమైంది.
తొలుత లేకుండే
బదిలీ నుంచి యూనియన్ నాయకుని పేరును నిజామాబాద్ సర్కిల్ కార్యాలయమే లేకుండా చేసిందనే అభియోగాలు గుప్పుమన్నాయి. ఈ విషయంపై ఎవరికేమి అనుమానాలు రావని అధికారులు గ్రహించినట్లు తెలుస్తోంది. ఎన్నికలప్పుడు బదిలీ అయ్యారని దానిని సాకుగా చూపించి యూనియన్ నాయకులతో మాట్లాడుకున్న మాదిరిగానే తొలి జాబితాలో పేరు లేకుండా చేశారనే ఆరోపణలు పవర్ హౌస్ అంత వ్యాపించింది.
అభ్యంతరాల తర్వాతనే
ఎదుటివారి తప్పులను, వారు చేసే పనులను క్షుణ్ణంగా పరిశీలించే రోజులు ఇవి. అలాంటి కోవలోనే ఒక యూనియన్ మరో యూనియన్ నాయకుల గురించి ఆరా తీసింది. ఆ ట్రేడ్ యూనియన్ నాయకుని పేరు బదిలీ జాబితాలో లేదేంటి అని సంబంధిత అధికారులని ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు రావడంతో, మీరు చెప్పినట్లుగానే తమకు రాతపూర్వకంగా ఇవ్వాలని కోరారు. ఆ అధికారి చెంత వాధోపవాదాలు పెరిగాయి. చివరకు యూనియన్ నాయకులు ఎస్ ఈ దగ్గరకు వెళ్లి విషయాన్ని వివరించి చెప్పడంతో కంపెనీకి వివరణ కోసం రాయాలని అధికారికి సూచించారు.
బదిలీ కాకుండానే అయినట్లు
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నగరానికి వచ్చిన రాజకీయ నాయకుడిని ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడు సన్మానించిన ఫోటో వైరల్ అయింది. ఎన్నికలప్పుడు ఉద్యోగులు రాజకీయ నాయకులకు దూరంగా ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. వీటిని దాటాడని గ్రహించిన కంపెనీ సీఎండీ ట్రేడ్ నాయకున్ని కామారెడ్డికి బదిలీ చేశారు. ఇక్కడ రిలీవ్ అయినా కామారెడ్డిలో చేరకపోగా, ఎలాగోలా తిప్పలు పడి 20 రోజులు అనంతరం యదా సీటులోనే ఉండిపోయారు. ఒకవేళ బదిలీ అయితే ఆరు నెలల తర్వాత వస్తేనే దానిని పరిగణలకు తీసుకునేందుకు వీలుంటుంది. బదిలీ కాకుండా అయినట్లు నోటి మాటతో సరిపెట్టాలని అధికారులు చూసారు. రాతపూర్వకంగా ఇస్తేనే ఉపేక్షిస్తామని మరో యూనియన్ నాయకులు భీష్మించుకొని కూర్చుండిపోయారు. ఎరక్కపోయి ఇరుక్కున్నట్లు అయిందని గ్రహించిన అధికారులు తప్పేలా లేదని కంపెనీ నుంచి వచ్చిన ఆదేశానుసారంగా ఆ ట్రేడ్ యూనియన్ నాయకుని పేరును మలి జాబితాలో జిగేల్ మనే విధంగా ప్రదర్శింపజేశారు. దీంతో తమ కళ్ళు చల్లభడ్డాయాని అనుకొని మరో ట్రేడ్ యూనియన్ నాయకులు చల్లబడ్డారు.
