నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ రెగ్యులర్ రెండవ, నాలుగవ,ఆరవ సెమిస్టర్ మరియు బ్యాక్ లాగ్ (2020 నుండి 2024 బ్యాచ్ ల కు) ఒకటవ, మూడవ,ఐదవ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 14 నుండి ప్రారంభమవుతాయని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అనువార్య కారణాల వలన ఈ పరీక్షలు 14వ తేదీకి బదులుగా ఈ నెల 16 తేదీ నుండి ప్రారంభం కానున్నాయని, తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షలకు 24,500 విద్యార్థులు 32 సెంటర్లలో హాజరవుతారని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య.కే. సంపత్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని కంట్రోలర్ తెలిపారు.
