Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 May 2025, 5:07 pm Posted by : ramakrishna

 తెయూ పరిధిలో డిగ్రీ పరీక్షల తాజా షెడ్యూలు విడుదల 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :  తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని  డిగ్రీ రెగ్యులర్  రెండవ, నాలుగవ,ఆరవ సెమిస్టర్ మరియు బ్యాక్ లాగ్ (2020 నుండి 2024 బ్యాచ్ ల కు)  ఒకటవ, మూడవ,ఐదవ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 14 నుండి ప్రారంభమవుతాయని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.  అయినప్పటికీ అనువార్య కారణాల వలన  ఈ పరీక్షలు  14వ తేదీకి  బదులుగా ఈ నెల 16 తేదీ నుండి ప్రారంభం కానున్నాయని, తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా  ఈ పరీక్షలకు  24,500 విద్యార్థులు  32 సెంటర్లలో హాజరవుతారని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య.కే. సంపత్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని కంట్రోలర్  తెలిపారు.